కర్నూలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మరోసారి కరోనా కలకలం రేగింది. కార్యాలయంలో పని చేసే ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావటంతో... మూడు రోజుల పాటు కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు కమిషనర్ డీకే. బాలాజీ ప్రకటించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వినతి పత్రాల కోసం ప్రత్యేకం ఓ బాక్సును ఏర్పాటు చేశామనీ.. ఆ బాక్సులోనే వినతి పత్రాలు వేయాలని కోరారు. కర్నూలు నగర పాలక సంస్థ కరోనా కారణంగా మూతపడటం ఇది మూడోసారి.
మూతపడిన మున్సిపల్ కార్యాలయం... ప్రజల కోసం ప్రత్యేక బాక్స్ - corona in kurnool municipal office news
కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయం మళ్లీ మూతపడింది. కార్యాలయంలో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావటంతో అధికారులు కార్యాలయాన్ని మూసివేశారు.
![మూతపడిన మున్సిపల్ కార్యాలయం... ప్రజల కోసం ప్రత్యేక బాక్స్ municipal office closed due to corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8125986-561-8125986-1595409128148.jpg)
మూతపడిన మున్సిపల్ కార్యాలయం