ప్రస్తుతం మనం కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని కర్నూలు జిల్లా డోన్ పట్టణ ప్రాంత మునిసిపాలిటీ కమిషనర్ కె.ఎల్.ఎన్ రెడ్డి తెలిపారు. వైరస్ వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందన్నారు. స్థానిక గాంధీ సర్కిల్లో అధికారులు... తహసిల్దార్ నరేంద్రనాథ్ రెడ్డి, సీ.ఐ సుబ్రహ్మణ్యం కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు.
'కనిపించని శత్రువుతో యుద్ధం చేయాల్సిందే' - ఈటీవీ భారత్ తాజా వార్తలు
కనిపించని శత్రువు కరోనా వైరస్‌పై యుద్ధం చేయాల్సిందేనంటూ కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని మునిసిపాలిటీ కమిషనర్ కె.ఎల్.ఎన్ రెడ్డి తెలిపారు. కరోనాపై ప్రజలకు ఎలా అవగాహన కల్పించాలో సచివాలయ ఉద్యోగులు, వాలంటరీలకు తెలిపి...స్థానిక పట్టణాన్ని కరోనా రహిత మార్చాలని సూచించారు.
కరోనాపై ప్రజలకు ఇవగాహన కల్పించండి
కరోనా గురించి ప్రజలకు ఎలా వివరించాలో ఈ మేరకు ఏఎన్ఎం నర్సింగ్ సచివాలయ ఉద్యోగులు, వాలంటరీలకు సూచించారు. ఎవరైనా మాస్కులు లేకుండా కనబడితే వారు మాస్కు పెట్టుకునేలా చూడాలని ఈ మేరకు కమిషనర్ పేర్కొన్నారు. అలాగే మనమందరం కలిసి డోన్ పట్టణాన్ని కరోనారహిత పట్టణంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఇదీ చదవండి