ప్రభుత్వ ఆసుపత్రిలో కర్నూలు ఎంపీ తనిఖీ
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పరికరాలు పనిచేసే తీరు ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
kurnool_mp_visits_govt_hospital
కర్నూలు ప్రభుత్వాసుపత్రిని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ తనిఖీ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించే పరికరాల మరమ్మతుల కోసం 450 కోట్ల రూపాయల సర్వీస్ కాంట్రాక్ట్ చేసుకున్న వారు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. కర్నూలు ఆసుపత్రిలో పడకలు పెంచే విషయమై ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.