ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎక్కువ పరీక్షలు చేస్తున్నందుకే ఎక్కువ కేసులు' - lurnool district latest news

రాష్ట్రంలోనే అత్యధికంగా కరోనా కేసులు కర్నూలు జిల్లాలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితులపై స్థానిక ఎంపీ కొవిడ్ ఆస్పత్రిలో సమావేశం నిర్వహించారు. పెరుగుతున్న కేసులతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

kurnool mp meeting with covid hospital doctors for covid cases in kurnool
కర్నూలు ఎంపీ సంజీవ్​కుమార్

By

Published : May 6, 2020, 11:10 PM IST

కరోనా కేసులతో కర్నూలు జిల్లా ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ ధైర్యం చెప్పారు. కొవిడ్ ఆసుపత్రిలో బాధితులకు కల్పిస్తున్న వసతులపై ఆయన వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఎక్కువగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నందున పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని... పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స అందించడం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తే కొవిడ్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details