పులకుర్తి భద్ర పథకం సామర్థ్యం పెంపునకు ముఖ్యమంత్రి సంతకం చేశారని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఎంపీని గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పీఎన్ అస్లాం మర్యాదపూర్వకంగా కలిసి.. శాలువా, గజమాలతో సత్కరించారు. ఇప్పటికే 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా మరో పది వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం ఆమోదించారన్నారు. దీంతోపాటు గాజులదిన్నె నుంచి కోడుమూరుకు 12 కోట్లతో పైపు లైన్ ఏర్పాటుకు సీఎం ఒప్పుకున్నట్లు వివరించారు. దీంతోపాటు గూడూరు నగర పంచాయతీ అభివృద్ధికి సహకరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, నగర పంచాయతీ కౌన్సిలర్లు హాజరయ్యారు.
పులకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంపునకు సీఎం ఆమోదించారు: ఎంపీ - today MP Dr Sanjeev Kumar comments news update
పులకుర్తి భద్ర పథకం సామర్థ్యం పెంపునకు ముఖ్యమంత్రి సంతకం చేశారని కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. ఎంపీని గూడూరు నగర పంచాయతీ చైర్మన్ జులపాల వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ పీఎన్ అస్లాం మర్యాదపూర్వకంగా కలిసి.. శాలువా, గజమాలతో సత్కరించారు.
ఎంపీకు శాలువా, గజమాలతో సత్కారం
ఇవీ చూడండి...:రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం.. తెగిపడిన ఒకరి తల!