కర్నూలులో రాత్రి వరదనీరు ఎక్కువగా రావటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ప్రాంతాలను కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సందర్శించారు. ఇళ్లలోకి నీరు చేరుకున్న కుటుంబాలకు ఆహార పోట్లాలను ఎమ్మెల్యే అందజేశారు.
నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే - Kurnool MLA Hafeez Khan
కర్నూలులో భారీ వర్షాలకు వరద ఉద్ధృతి పెరిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు నీటమునిగాయి. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఆ ప్రాంతాలను సందర్శించి ఆహార పోట్లాలను అందించారు.
నిటమునిగిన ప్రాంతాలను సందర్శించి ఎమ్మెల్యే
మరో పక్క హంద్రీ నదికి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాత్రి 42 వేల క్యూసెక్కులు నీళ్లు జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల చేయగా.. ప్రస్తుతం 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండిహంద్రీనీవా కాలువకు నీటి విడుదల