'వారంతా రైతులు కాదు.. తెదేపా కార్యకర్తలే ఎక్కువ మంది' - kurnool mla katasani rambhupal reddy news
అమరావతిలో రాజధానిని కట్టడం కష్టసాధ్యమని... కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. అందుబాటులో ఉన్న వనరులతోనే రాజధానిని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో... విశాఖను రాజధానిగా సీఎం ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం కర్నూలు జిల్లా రైతులు భూములు ఇచ్చారు కానీ... ఎప్పుడూ రోడ్లపైకి రాలేదని అన్నారు. అమరావతిలో కొంత మంది రైతులు మాత్రమే నిరసన చేస్తున్నారని... మిగతా వారందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అని ఆరోపణలు చేశారు.
పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియా సమావేశం
TAGGED:
kurnool mla