ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కోవిడ్ నిబంధనలను అనుసరించి రంజాన్ జరుపుకోవాలి' - corona in kurnool news

కరోనా కట్టడికి అందరూ కృషి చేయాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. రంజాన్ పండుగను కోవిడ్ నిబంధనలను అనుసరించి జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ramadan
ముస్లిం పెద్దలతో ఎమ్మెల్యే సమావేశం

By

Published : May 12, 2021, 8:19 PM IST

కొవిడ్ నిబంధనలు పాటించి రంజాన్ పండుగను జరుపుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ అన్నారు. ముస్లిం పెద్దలతో ఆయనతో పాటు.. డీఎస్పీ మహేష్, నగర పాలక సంస్థ కమిషనర్ డీకే. బాలాజీ సమావేశమయ్యారు.

పండుగ సందర్భంగా మసీదులో 50 మందికి మాత్రమే ప్రార్థనలకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అందరూ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో రంజాన్ ప్రార్థనలు నిషేధం అన్నారు.

ABOUT THE AUTHOR

...view details