ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధాని అమరావతి ఓ కుంభకోణం..!' - రాజధాని అమరావతి ఒక స్కాం అని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఎద్దేవా

బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను స్వాగతిస్తున్నామని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ తెలిపారు. రాజధాని అమరావతి ఒక స్కాం అని ఎద్దేవా చేసిన ఆయన.. అమరావతిలో డ్రామా చేస్తున్నారని ఆరోపించారు.

Kurnool MLA Hafiz Khan says Boston Consulting Group welcomes report
మీడియాతో మాట్లాడుతున్న కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్

By

Published : Jan 4, 2020, 2:54 PM IST

అమరావతి ఓ స్కాం అన్న ఎమ్మెల్యే

రాజధాని అమరావతి ఒక స్కాం అని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఎద్దేవా చేశారు. అమరావతిలోని మూడు గ్రామాల ప్రజల కోసం రాష్ట్ర ప్రజలందరికీ అన్యాయం చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదన్నారు. ఒకప్పుడు కర్నూలులో రాజధాని కోసం త్యాగం చేసిన ప్రజలు రోడ్లపైకి రాలేదన్నారు. ఇప్పుడు మాత్రం డ్రామా కంపెనీ ఆర్టిస్టులతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీరి ఆందోళనకు ప్రజల మద్దతు లేదన్నారు. ప్రతి జిల్లాకు న్యాయం జరుగుతుందని.. అమరావతిలోని మూడు గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్​ను విమర్శించినా ఆయన న్యాయం చేస్తారని చెప్పారు. బోస్టన్​ కన్సల్టింగ్​ గ్రూప్​ నివేదికను స్వాగతిస్తున్నామని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details