కరోనా మృతుల పట్ల చిన్నచూపు చూడొద్దని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో కరోనాతో ఓ వ్యక్తి మృతిచెందగా... అతని అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు సైతం ముందుకు రాలేదు. దీంతో ఎమ్మెల్యే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించారు. కరోనాతో మృతిచెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు.
కరోనాతో మృతిచెందిన వ్యక్తికి ఎమ్మెల్యే అంత్యక్రియలు - కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తాజా వార్తలు
కరోనా బారిన పడి మృతిచెందిన వారి పట్ల చిన్నచూపు చూడోద్దని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. జిల్లాలో ఓ వ్యక్తి కరోనాతో మృతిచెందగా అతని కుటుంబసభ్యులెవరు దహనసంస్కారాలు చేయటానికి ముందుకు రాకపోవటంతో ఎమ్మెల్యే స్వయంగా అంత్యక్రియలను పూర్తి చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
కరోనాతో మృతిచెందిన వ్యక్తికి ఎమ్మెల్యే అంత్యక్రియలు