మధ్య ప్రాచ్యదేశాలకు ఏపీ సహాయ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైనందుకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ను ఆయన అనుచరులు సన్మానించారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఇప్పటికే పనిచేస్తున్న జుల్ఫీకి సహాయంగా హఫీజ్ఖాన్ని నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యేను ఆయన అనుచరులు సన్మానించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. మధ్య ప్రాచ్యదేశాల్లోని వ్యాపార వాణిజ్య అవకాశాలు, పెట్టుబడులను ఏపీకి తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం - ఎమ్మేల్యే హఫీజ్ ఖాన్ తాజా సమాచారం
మధ్య ప్రాచ్యదేశాలకు... ఆంధ్రప్రదేశ్ సహాయ ప్రత్యేక ప్రతినిధిగా ఎంపికైన ఎమ్మెల్యే హాఫీజ్ఖాన్ను ఆయన అనుచరులు సన్మానించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఈపదవికి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
ఎమ్మేల్యే హఫీజ్ ఖాన్ కు సన్మానం