కర్నూలు జిల్లా పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు చెందిన రెండు వందల కుటుంబాలు తమిళనాడులో.. వివిధ పనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. పురుషులు భవననిర్మాణ కార్మికులుగా, మహిళలు రామ్‌రాజ్, ఓంటెక్స్, ఎన్‌సీసీ వంటి టెక్స్‌టైల్స్ పరిశ్రమల్లో దుస్తులు కుట్టే పనిలో దినసరి కూలీలుగా పనులు చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూసివేయడం, భవన నిర్మాణాలను ఆపివేయడంతో వసల కార్మికులు ఉపాధి కోల్పోయారు. కూలీ డబ్బులు అందకపోవడం... పనులు లేక, తినడానికి తిండి లేక, నివాస గృహాలకు అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. సొంతూరు వెళ్లడానికి అనుమతించాలని తిరుపూరు జిల్లా కలెక్టర్‌కు మూడు సార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందించడం లేదని వాపోతున్నారు.
తమిళనాడులో చిక్కుకున్న కర్నూలు వలస కూలీలు - తమిళనాడులో చిక్కుకున్న కర్నూలు వాసులు
కర్నూలు జిల్లాకు చెందిన వలస కార్మికులు తమిళనాడులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి కోసం తమిళనాడులోని తిరుపూరు జిల్లా ఇడుంపాళ్యం గ్రామానికి వెళ్లిన కార్మికులు లాక్‌డౌన్‌తో ఇరుక్కుపోయారు.
![తమిళనాడులో చిక్కుకున్న కర్నూలు వలస కూలీలు](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News