ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Death : కూలిన మట్టిపెళ్లలు... వ్యక్తి మృతి - ప్రమాద వార్తలు

కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం గులాంనబీ పేట సమీపంలో మట్టిపెళ్లలు విరిగి, మీద పడటంతో వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రుద్రవరం మండలం నల్లవాగు పల్లె గ్రామానికి చెందిన షేక్ మస్తాన్వలి గా గుర్తించారు.

Accident
ప్రమాదం

By

Published : Jul 3, 2021, 10:10 PM IST

మట్టిపెళ్లలు మీదపడి వ్యక్తి మృతి చెందిన ఘటన కర్నూలు​ జిల్లా బనగానపల్లె మండలం గులాంనబీపేట సమీపంలో జరిగింది. రుద్రవరం మండలం నల్లవాగు పల్లెకు చెందినషేక్ మస్తాన్వలి అనే వ్యక్తి కూలి పని కోసం గులాంనబీ పేట వెళ్లాడు. అక్కడ మట్టిని తవ్వుతుండగా పైనుంచి పెళ్లలు విరిగి మీద పడ్డాయి. దాంతో ఊపిరాడక మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివ శంకర్ నాయక్ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details