కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు తుంగభద్ర నదిలో జలదీక్ష చేపట్టారు. హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ 94 రోజులుగా న్యాయవాదులు రిలే నిరాహర దీక్షలు చేపట్టినా ప్రభుత్వం స్పందించకపోవడంతో... వారు నదిలో దిగి నిరసన తెలిపారు. జీఎన్ రావు కమిటీ పర్యటన పూర్తైనా... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి హైకోర్టు విషయమై నిర్ణయం తీసుకోకపోవడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపాలని కోరారు.
శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలంటూ న్యాయవాదుల జలదీక్ష - కర్నూలు న్యాయవాదుల జలదీక్ష
1937 నవంబరు 16న జరిగిన శ్రీబాగ్ ఒడంబడికను వెంటనే అమలు చేయాలంటూ కర్నూలు హైకోర్టు న్యాయవాదులు తుంగభద్ర నదిలో జలదీక్ష చేశారు.

శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలంటూ కర్నూలు న్యాయవాదుల జలదీక్ష
శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయాలంటూ కర్నూలు న్యాయవాదుల జలదీక్ష
ఇదీ చదవండి :
TAGGED:
కర్నూలు న్యాయవాదుల జలదీక్ష