ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంటూరు నుంచి స్వగ్రామాలకు చేరిన కార్మికులు - గుంటూరు నుంచి కర్నూలు చేరిన కార్మికులు

ఉపాధి కోసం కర్నూలు జిల్లా నుంచి గుంటూరుకు వచ్చిన వలస కార్మికులను అధికారులు వారి స్వస్థలాలకు చేర్చారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వారిని క్వారంటైన్​కు తరలిస్తామని అధికారులు తెలిపారు.

kurnool labours move to their villages who were in guntur
గుంటూరు నుంచి స్వగ్రామాలకు చేరిన కర్నులు జిల్లా కార్మికులు

By

Published : Apr 29, 2020, 4:18 PM IST

కర్నూలు జిల్లా నుంచి ఉపాధి కోసం గుంటూరు వెళ్లిన కార్మికులను హోంమంత్రి సుచరిత చొరవతో వారి స్వగ్రామాలకు చేర్చారు. ప్రత్యేక బస్సుల్లో అధికారులు వారిని తరలించారు. జిల్లాలోని ఆలూరు, దేవనకొండ, హోళగుంద, చిప్పగిరి, హాలహర్వి, ఆస్పరి ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మంది పని కోసం గుంటూరు వలస వెళ్లారు. లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న హోమంత్రి వారిని స్వగ్రామాలకు చేర్చాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు 600 మందిని ప్రత్యేక బస్సుల్లో కర్నూలు జిల్లాకు చేర్చారు. వారందరినీ ప్రత్యేక శిబిరాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలలో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details