ప్రశ్న: ఈ-టికెట్ విధానం తీరుతెన్నులు ఏంటి..?
జవాబు: కొవిడ్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ-టికెట్ విధానం తీసుకొచ్చాం. ప్రత్యేక వెబ్‌సైట్ అభివృద్ధి చేసి పుష్కరాలకు పది రోజులకు ముందే అందుబాటులోకి తెస్తాం. తుంగభద్ర నదిని ఆనుకుని ఏర్పాటు చేసిన ఘాట్‌ల వివరాలను పొందుపరుస్తాం.
ప్రశ్న: బుకింగ్ చేసుకున్న వారికి ఏదైన ప్రత్యేక సమయం కేటాయిస్తారా..?
జవాబు: ప్రతి ఘాట్‌లో 15 నిమిషాల టైం స్లాట్ కేటాయిస్తాం. భక్తునికి భక్తునికి ఆరు అడుగుల దూరం తప్పనిసరి చేస్తున్నాం. ఘాట్ పొడవును దృష్టిలో పెట్టుకుని ప్రతి స్లాట్‌లో 20 మందికి పుణ్యస్నానాలకు అనుమతిస్తాం. పుష్కరాల్లో పిండ ప్రదానం చేసేవారికి 15 నిమిషాలు సరిపోదు కనుక 30 నిమిషాల టైం స్లాట్ కేటాయిస్తున్నాం.
ప్రశ్న: ఈ-టికెట్ బుకింగ్ చేశాక ఎంత సేపటికి సమాచారం భక్తులకు అందుతుంది..?
జవాబు: ఈ-టికెట్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో ఆ కుటుంబ సభ్యుల పేర్లు, స్లాట్ వివరాలతో చరవాణికి వెంటనే సందేశం వెళుతుంది. సొంతంగానైనా, రాష్ట్రంలో ఉన్న గ్రామ సచివాలల్లోనైనా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు.
ప్రశ్న: కొవిడ్ నిబంధనల మేరకు ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు..?
జవాబు: బస్సులు, కార్లకు కేటాయించిన పార్కింగ్ స్థలాల నుంచే కొవిడ్ నిబంధనలు అమలు చేస్తాం. భౌతికదూరం పాటిస్తూ మాస్క్ ధరించాలి, మాస్క్ లేనిదే పుణ్యస్నానానికి అనుమతి లేదు. స్లాట్‌లో ప్రకారం ఒక విడత 20 మంది స్నానాలు ఆచరించి వెళ్లగానే ఆ ఘాట్‌ను శానిటైజ్ చేస్తాం. ఆ తరువాత మరో బ్యాచ్‌కు అవకాశం కల్పిస్తాం.