మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కర్నూలులో జనసేన నాయకులు ధర్నా చేపట్టారు. వీటిని నివారించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ.. కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే.. దిశ చట్టం ఉన్నా మహిళలు, చిన్నారులపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి స్పందించి.. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళలపై అత్యాచారాలను నిరసిస్తూ జనసేన ధర్నా - kurnool janasena protest on government inability to control rape attacks
రాష్ట్రంలో పెరిగిపోతున్న అత్యాచారాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ జనసేన నాయకులు నిరసనకు దిగారు. మహిళలు, చిన్నారులను కాపాడుకోలేని దయనీయ పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. హోంమంత్రి స్పందించాలంటూ.. కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు.
ధర్నా నిర్వహిస్తున్న జనసేన నాయకులు
TAGGED:
కర్నూలులో జనసేన నాయకుల ధర్నా