కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 75కు చేరుకోవడంతో అధికారులు లాక్డౌన్ నిబంధనను కట్టుదిట్టం చేశారు. నగరంలోని పలు కాలనీలను రెడ్జోన్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులను బయటకి రానివ్వడం లేదు. ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను అధికారులే ఇంటింటికి అందిస్తున్నారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని, తమకు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారికి పలువురు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఈ సమయంలో ప్రజలు గుంపులుగా గుమిగూడటంతో వైరస్ మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా దాతృత్వం చేసే సమయాల్లో భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు.
కర్నూలులో పటిష్టంగా లాక్డౌన్ అమలు
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో 349 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒక్క కర్నూలు జిల్లాలోనే 75 మంది బాధితులు ఉన్నారు. జిల్లాలో సంఖ్య పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కేంద్రంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
కర్నూలు కఠినంగా లాక్డౌన్ నిబంధన