క్వింటా వేరుశనగను అధిక శాతం వ్యాపారులు నాలుగు వేల రూపాయలకే కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వ్యవసాయ మార్కెట్‌కు.. ఆదివారం 10,308 బస్తాల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. గరిష్ఠంగా 5,510, కనిష్ఠంగా 2,419 రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేశారని చెబుతున్నారు. నాణ్యతను పరిశీలించి రేటు నిర్ణయించినట్లు అన్నదాతలు వెల్లడించారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా మద్ధతు ధరకు ప్రభుత్వమే తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
మద్ధతు ధర దక్కక వేరుశనగ రైతు విలవిల - కర్నూలులో వేరుశనగకు దక్కని మద్ధతు ధర
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో.. వేరుశనగ పంటను రైతులు వివిధ రేట్లకు అమ్మారు. మద్ధతు ధర కూడా రాకుండా వారి ఇష్టం వచ్చినట్లు వ్యాపారులు కొనుగోలు చేశారని అన్నదాతలు వాపోయారు. ఆయిల్‌ఫెడ్ ద్వారా తమ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
మార్కెట్‌కు తరలివచ్చిన వేరుశనగ