కోవిడ్ వాక్సిన్ తీసుకోవటంలో వైద్యులు, సిబ్బంది ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నరేంద్రనాథ్ రెడ్డి, జిక్కి తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్‌ను పరిశీలించిన అనంతరం ఈటీవీతో మాట్లాడారు. కర్నూలు సర్వజన వైద్యశాలలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని.. దీని కోసం అన్ని ఏర్పాట్లు చేశామని చెబుతున్న వైద్యాధికారులు స్పష్టం చేశారు.
మూడో దశ ప్రయోగాలు పూర్తి చేసుకున్న తర్వాతే కొవీషీల్డ్ను వినియోగిస్తున్నందున భద్రత గురించి అనుమానమే అక్కర్లేదని వైద్య నిపుణులు తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రిలో వైద్యులకు టీకా ఇచ్చామని.. వారిలో ఎవరికీ, ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదన్నారు. అనుకోని పరిస్థితులు ఏర్పడినా అందుకు అవసరమైన ఎమర్జెన్సీ కిట్లు ముందుజాగ్రత్తగా సిద్ధంగా ఉంచామన్నారు. టీకా వేసిన తర్వాత సంప్రదించేందుకు నంబర్ ఇచ్చి పంపిస్తున్నట్టు వారు తెలిపారు.