కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న వేళ కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారు. రాకపోకలు పూర్తిగా నిషేధించారు. వన్‌టౌన్ ప్రాంతంలో ఓ గర్బిణిని మహిళా పోలీసుల ఆధ్వర్యంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోడ్డుపక్కన ఉండే వారికి వన్ టౌన్ పోలీసులు భోజన ప్యాకెట్లను అందించారు.
ప్రజలకు అండగా కర్నూలు జిల్లా పోలీసులు - @corona ap cases
కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో అధికారులు రెడ్ జోన్ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఓ గర్భిణికి నొప్పులు రాగా.. పోలీసులు వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
ప్రజలకు సాయం చేస్తున్న కర్నూలు జిల్లా పోలీసులు