కర్నూలు నగరంలో కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ బాలాజీ తెలిపారు. నగర ప్రజలు మాస్కులు వేసుకోవటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై.. మాస్క్ వేసుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే రూ. 200 జరిమానా విధిస్తున్నట్లు హెచ్చరించారు. కంటైన్మెంట్ జోన్లలో దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
'మాస్క్ లేకుంటే జరిమానా తప్పనిసరి'
కర్నూలు జిల్లా ప్రజలు మాస్కు వేసుకోకుండా బయటకు వస్తున్నారని నగరపాలక కమిషనర్ బాలాజీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి మాస్క్ వినియోగం తప్పనిసరి అన్నారు. అది లేకుండా బయటకువస్తే జరిమాన విధిస్తామని హెచ్చరించారు.
kurnool dst muncipal commissioner waned fine will be collected if people dont wore mask