ప్రశ్న: కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు కారణం ఏమిటి?
జవాబు: జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా రావడానికి కారణం మొదట్లో దిల్లీ నుంచి వచ్చిన వారు. తరువాత కోయంబేడు మార్కెట్, ఇప్పుడు ఆదోని ప్రాంతానికి ముంబయి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వలస కూలీలు.. వీరి వల్లే కేసుల ఎక్కువగా వస్తున్నాయి.
ప్రశ్న: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి వల్ల కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందింది అంటున్నారు. ఎంత వరకు వాస్తవం?
జవాబు: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల వల్ల బంధువులకు, చుట్టు పక్కల వారికి కూడా వ్యాధి సోకింది.
ప్రశ్న: ఇలా సోకకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?
జవాబు: కరోనా కట్టడికి కలెక్టర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నాము. మాస్క్ లేకుండా బయట తిరగకుండా చర్యలు చేపట్టాం. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రత, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వ చర్యలకు ప్రజల సహకారం అవసరం.
ప్రశ్న: లక్షకు పైగా శాంపిల్స్ తీశారు. వీటికి ఎక్కువగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి?
జవాబు: ప్రభుత్వ ఆదేశాల మేరకు వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు, వలస వచ్చిన వారు, కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారి నుంచి శాంపిల్స్ అధికంగా తీస్తున్నాం. వారిలో వివిధ రకాల లక్షణాలు కనిపిస్తున్నాయి. జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి తదితర లక్షణాలు గుర్తించాం.
ప్రశ్న: ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం చెబుతోంది. అది ఎంత వరకు అమలవుతోంది?
జవాబు: శిక్షణ తీసుకున్న సిబ్బంది ఉండటంతో.. ఖచ్చితంగా ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నాం.
ప్రశ్న: మరణాల సంఖ్య కర్నూలు జిల్లాలో ఎందుకు అత్యధికంగా ఉంది?