కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయటం దారుణమని... తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలోని హిందూ ఆలయాలపై, హిందువులపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'దాడులపై సీఎం ఎందుకు స్పందించడం లేదు' - సోమిశెట్టి వెంకటేశ్వర్లు తాజా వార్తలు
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై వరుసగా జరుగుతున్న ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ ఎందుకు స్పందించడం లేదని.. కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. హిందువుల గురించి, దేవతా విగ్రహాల ధ్వంసం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు