పోలీసుల సేవలు సద్వినియోగం చేసుకుని..ప్రాణాపాయ స్థితి నుంచి బయట పడిన ఆదిలక్ష్మిని కర్నూలు ఎస్పీ పక్కిరప్ప అభినందించారు. యాభై వేల రూపాయలను ఆమెకు అందజేశారు. అలాగే మహానంది పోలీసులను ఆయన సన్మానించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ చిదానంద రెడ్డి, సీఐలు పాల్గొన్నారు.
అసలు ఏం జరిగిందంటే..
కర్నూలు జిల్లా నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ జీవితం పై విరక్తి చెందింది. తన ఇద్దరు ఆడ పిల్లలతో కలిసి సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. మహానంది మండలం సర్వ నరసింహ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటనకు పాల్పడింది. అయితే వెంటనే మనుసు మార్చుకున్న ఆమె దిశ యాప్‌కు సమాచారాన్ని ఇచ్చింది. స్పందించిన మహానంది పోలీసులు ఆదిలక్ష్మి, ఇద్దరు పిల్లలను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారు కోలుకున్నారు. ఆదిలక్ష్మి భర్త ప్రసాద్ ఏడాది క్రితం మృతి చెందాడు.
ఇదీ చదవండీ..కడప పాత బస్టాండులో ఓ వ్యక్తి వీరంగం