కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల చెందిన ఓ సైనికుడు మరణించాడు. గ్రామానికి చెందిన పొలుకంటి చాకలి రాముడు, రాములమ్మ దంపతుల ఏకైక కుమారుడు శివగంగాధర్ 2017లో సైన్యంలో చేరారు. ప్రస్తుతం లద్దాఖ్ జిల్లాలోని లేలా ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం సోముదేవులపల్లి గ్రామానికి చెందిన రాధికతో వివాహమైంది. శుక్రవారం విధి నిర్వహణలో శివగంగాధర్ ప్రమాదవశాత్తు లోయలో పడి గాయాలపాలై మృతి చెందినట్లు సైనికాధికారుల నుంచి సమాచారం అందింది. భౌతికకాయం నేడు (ఆదివారం) ఇంటికి చేరే అవకాశం ఉంది.
లోయలోపడి సైనికుడి మృతి - సైనికుడు మృతి
సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ సైనికుడు శుక్రవారం విధినిర్వహణలో మరణించారు. పెళ్లైన 3 నెలలకే ఈ ఘటన జరగడంతో తల్లిదండ్రులు, బంధువులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.
![లోయలోపడి సైనికుడి మృతి jawan death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10712052-984-10712052-1613869184698.jpg)
లోయలోపడి సైనికుడి మృతి