కర్నూలు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల (PARISHAD RESULTS) లెక్కింపు పూర్తైంది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
జిల్లాలో 807 ఎంపీటీసీలకు గాను 312 ఏకగ్రీవం అయ్యాయి. 11 స్థానాలకు ఎన్నికలు జరగలేదు. 484 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 53 జడ్పీటీసీ స్థానాలకు గాను 16 ఏకగ్రీవం అయ్యాయి. నంద్యాల జడ్పీటీసీ స్థానంలో అభ్యర్థి మరణించగా.. మిగిలిన 36 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగాయి.