వర్షానికి తెగిన వంతెన-నిలిచిపోయిన వాహనాలు - kovvali
కర్నూలు జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి కొవ్వలి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న వంతెన తెగింది. ఈ కారణంగా కర్నూలు- బళ్లారి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
వర్షానికి తెగిన వంతెన-నిలిచిపోయిన వాహనాలు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం కొవ్వలి గ్రామం వద్ద నిన్న రాత్రి కురిసిన వర్షానికి వంతెన తెగింది. దీని వల్ల కర్నూలు -బళ్లారి రాకపోకలు నిలిచిపోయాయి. కురువల్లి గ్రామం వద్ద చెరువు నిండి పొంగిపొర్లటం వల్ల చెరువు కింద ఉన్న రహదారి కోతకు గురైంది. ఏడాది నుంచి నేషనల్ హైవే పనుల్లో భాగంగా వంతెన నిర్మాణం చేపట్టారు... అయితే అది పూర్తిగా నిర్మాణం కాకుండా నిలిచిపోవటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.