ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాలుగేెళ్లగా ఇంటి కోసం పోరాటం' - house seeking justice in kurnool latest

దౌర్జన్యంగా తమ ఇంటికి తాళం వేశారంటూ.. ఓ కుటుంబం ధర్నాకు దిగింది. అంతా కలిసి కలిసి ఇంటి ముందు బైఠాయించారు. నాలుగేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

fight for  justice
ఇంటి కోసం పోరాటం

By

Published : Oct 27, 2020, 5:42 PM IST

తమ ఇంటికి దౌర్జన్యంగా తాళం వేశారని, న్యాయం చేయాలని కోరుతూ... ఖాసీంబీ అనే మహిళ కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. కర్నూలు జిల్లా పాణ్యంలోని ఉప్పరిపేటలో ఈ ఘటన జరిగింది. కమ్ము సాహెబ్‌, ఖాసీంబీలకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వారు బంధువుల నుంచి 1968లో స్థలం కొనుగోలు చేసి 1986లో పంచాయతీ అనుమతితో ఇల్లు నిర్మించుకున్నామన్నారు. అప్పటి నుంచి అదే ఇంట్లో ఉంటూ పన్నులు, విద్యుత్‌ బిల్లులు సైతం చెల్లించామన్నారు.

2015లో తన భర్త మరణించడంతో పెద్దమనుషుల సమక్షంలో ఇద్దరు కుమారులకు ఇంటిని పంచామన్నారు. 2016లో బంధువుల ఊరికి వెళ్లిన సమయంలో కొందరు ఆక్రమించి ఇంటికి తాళం వేశారని, తాము తాళం తెరవడానికి వెళ్లగా దాడి చేశారని చెప్పారు. నాలుగేళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. కోడలు నిండు గర్భిణి అని.. కాన్పునకు వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదని వాపోయారు. ఏఎస్సైకు ఫిర్యాదు చేయగా విచారణ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details