విద్యార్థులను కరోనా నుంచి కాపాడే రక్షణ కవచాలుగా మారాయి చీరలు. కొవిడ్ కారణంగా నిలిపివేసిన పాఠశాలలు తిరిగి ప్రభుత్వ అనుమతులతో ప్రారంభించారు. ఈ క్రమంలో పిల్లలు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా వినూత్న ఆలోచన చేశారు కర్నూలు జిల్లా గడివేముల జిల్లా ఉర్దు ఉన్నత పాఠశాల యాజమాన్యం. విద్యార్ధుల మధ్య చీరలు కట్టి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠాలు చెబుతున్నారు. ఈ ఆలోచన అందర్నీ ఆకర్షిస్తోంది.
పిల్లలకు రక్షణ కవచాలుగా మారిన చీరలు... - పిల్లలకు రక్షక కవచాలుగా చీరలు
భారతీయ సంప్రదాయంతో పాటు, స్త్రీల అందాన్ని పెంచి ఎంతో ఆకర్షణగా నిలిచే చీరలు... నేడు పిల్లలకు రక్షణ కవచాలుగా కూడా మారాయి. కొవిడ్ నుంచి పిల్లలను కాపాడుకునేందుకు చీరలను తెరలుగా కట్టి బోధిస్తున్నారు.. ఓ ఉర్దూ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు. ఈ వినూత్న పద్ధతి అందర్నీ ఆకర్షిస్తోంది. టీచర్ల ఆలోచనను పలువురు మెచ్చుకుంటున్నారు.
పిల్లలకు రక్షక కవచాలుగా మారిన చీరలు...