కర్నూలు జిల్లా నంద్యాల ఎస్సార్బీసి కాలనీలో ఉన్న కొవిడ్ కేర్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ తనిఖీ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న కరోనా బాధితులతో మాట్లాడారు. నాణ్యమైన ఆహారం, వేడినీళ్లను అందజేయాలని వైరస్ బాధితులు కలెక్టర్‌ను కోరారు. ఆహారం ఆలస్యంగా వస్తుందని తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులపై మండిపడ్డారు.
సమస్య పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలనీ.. లేకపోతే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. కొవిడ్ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.