కర్నూలు జిల్లా నంద్యాల వరద ప్రభావ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వీర పాండియన్, ఎస్పీ ఫకీరప్పా, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. నంద్యాల సమీపంలో అభాండం తండా వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవటంతో.. వరికోత యంత్రంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. జలమయమైన కాలనీల్లో పర్యటించి.. పరిస్థితిని పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు.
వరికోత యంత్రమెక్కి... వరద ప్రాంతాల్లో పర్యటన - nandyala flood news
కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎంపీ.. నంద్యాల వరద ప్రభావ ప్రాంతాల్లో పర్యటించారు. వాహనాలు వెళ్లేందుకు వీలు లేకపోవటంతో.. వరికోత యంత్రం పైకి ఎక్కి వరద ప్రభావిత కాలనీల్లో పర్యటించారు.
![వరికోత యంత్రమెక్కి... వరద ప్రాంతాల్లో పర్యటన kurnool collector visit in flood effected areas](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8952672-641-8952672-1601140410035.jpg)
వరద ప్రాంతాల్లో అధికారుల పర్యటన