ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Collector veerpandian 'ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తాం'

2017లో కర్నూలులో ఓ పాఠశాల వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న ప్రీతి విషయంలో.. కలెక్టర్ స్పందించారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడిన కలెక్టర్... వారికి సాగు, నివాస భూమి, ఆర్థిక సహాయం ప్రకటించారు.

కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్
కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్

By

Published : Jul 3, 2021, 5:54 PM IST

ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు... సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా న్యాయం చేస్తామని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. కర్నూలులోని ఓ ప్రైవేటు పాఠశాలలో 2017లో పదో తరగతి విద్యార్థినిగా ఉన్న ప్రీతి.. పాఠశా‌ల వసతి గృహంలో ఆత్మహత్య చేసుంది. ఈ ఘటనతో తమకు న్యాయం చేయాలని ప్రీతి తల్లిదండ్రులు నేటికీ ఆందోళనలు చేస్తున్నారు. వీరి ఆవేదనపై ప్రభుత్వం స్పందించింది. ఆమె తల్లిదండ్రులు పార్వతీదేవి, రాజు నాయక్ లను కలెక్టర్ కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు.

ప్రీతి కుటుంబసభ్యులకు ఐదెకరాల భూమి, ఐదు సెంట్ల స్థలం, ప్రీతి తండ్రి రాజునాయక్​కు ఉద్యోగం ఇస్తామని కలెక్టర్ వీర పాండియన్ తెలిపారు. ప్రీతి తల్లి పార్వతీదేవికి వైద్యం అందించాలన్న ప్రతిపాదనపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని పార్వతి దేవికి రావలసిన 11 నెలల జీత భత్యాలు విడుదల చేయించారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details