ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2021, 7:32 PM IST

ETV Bharat / state

ఆదోనిలో నిలిచిపోయిన సబ్​రిజిస్ట్రార్​ కార్యకలాపాలు

కర్నూలు జిల్లా ఆదోనిలో సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయం బోసిపోయింది. డాక్యుమెంట్ రైటర్లు ప్రజల వద్ద నుంచి అధిక సొమ్ము వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు.. నేడు అధికారులు, సిబ్బందితో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చర్చించారు. తిరిగి అలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

MLA Sai Prasad Reddy
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆదోనిలోని సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయం బోసిపోయింది. అధికారులు ఎవరు హాజరు కాలేదు, డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలు మూసేశారు. నిన్న రైటర్ తీరు పై ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ రైటర్​లు విచ్చలవిడిగా డబ్బులు దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయని, వారి తీరు పై హెచ్చరించారు. కార్యాలయంలో ఏ పని చేసిన రైటర్లు, సిబ్బంది డబ్బులు అడుగుతారని.. తన దృష్టికు వచ్చిందన్నారు. కావాలనే కుమ్మకై రెడ్ మార్కు పెట్టి వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తీరు మార్చుకోకపోతే రైటర్లు అందరిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనితో ఈ రోజు అధికార సిబ్బంది, రైటర్​లతో సమావేశం జరిగింది. మరో సారి ఇలా జరిగితే సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయం సిబ్బంది, రైటర్​ల పై తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఎమ్మెల్యే హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details