ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభివృద్ధి జరుగుతోంది అందరూ చప్పట్లు కొట్టండి' - 'అభివృద్ధా! అదెక్కడ?' మేయర్​పై వైసీపీ కార్పొరేటర్ల ధ్వజం - Bills not Passed to Contractors

Kurnool Development Works Issue: కర్నూలు అభివృద్ధి పనులపై వైసీపీ కార్పొరేటర్లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక్కవార్డులో పనులు జరిగితే నగరమంతా జరిగినట్లేనా అని మేయర్​ను నిలదీశారు. వివరాల్లోకి వెళ్తే..

Kurnool_Development_Works_Issue
Kurnool_Development_Works_Issue

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2023, 11:07 AM IST

Kurnool Development Works Issue: కర్నూలు నగరమంతా అభివృద్ధి జరుగుతోంది.. అందరూ చప్పట్లు కొట్టండి. అని మేయర్‌ అనగానే.. 'అభివృద్ధా.. ఎక్కడ..? అని కార్పొరేటర్లు ఎదురు ప్రశ్నించారు. ఓ వార్డులో పనులు జరిగితే.. నగరమంతా జరిగినట్లేనా అని నిలదీశారు. నగరపాలక సంస్థలో కనీస పనులు జరగట్లేదని, చిన్న పనికి సైతం బిల్లులు పాస్‌ కావడం లేదని.. కార్పొరేటర్లు మండిపడ్డారు. పాలకమండలి కొలువుదీరిన దగ్గరి నుంచి అభివృద్ధి ఊసే లేదని తేల్చిచెప్పారు. దీంతో చాలాసేపు మిన్నకుండిపోయిన మేయర్‌.. చివరికి డ్యామేజ్‌ని తగ్గించే ప్రయత్నం చేశారు.

Kurnool Municipal Council: కర్నూలు నగరపాలక సమావేశంలో నగర అభివృద్ధి(Kurnool Development Works)పై.. వైసీపీ కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సమావేశంలో నగరంలో మేయర్‌, కమిషనర్‌ చొరవతోఅభివృద్ధి జరుగుతోందని.. చెత్తపన్ను సైతం తగ్గించారని.. 40వ వార్డు కార్పొరేటర్‌ విక్రమసింహారెడ్డి ప్రస్తావించారు. వెంటనే మేయర్‌ రామయ్య.. నగరమంతా అభివృద్ధి జరుగుతోంది.. సభ్యులందరూ చప్పట్లు కొట్టాలని సూచించారు. దీనిపై మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు తీవ్రంగా మండిపడ్డారు. ఒక్కవార్డులో పనులు జరిగితే నగరమంతా జరిగినట్లేనా అని.. మేయర్‌ని ప్రశ్నించారు.

Village Development Works: మీ పనులు మాకొద్దు బాబోయ్..! ప్రభుత్వ పనులంటే ఆసక్తి చూపని సర్పంచ్‌లు..

Kurnool Mayor on Development Works: మేయర్‌ సర్దిచెప్పే ప్రయత్నం చేయగా.. 11వ వార్డు కార్పొరేటర్‌ ఫరాజ్‌ఖాన్‌ తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఆయనకు మిగిలిన వారు మద్దతు తెలిపారు. గుత్తేదారులకు బిల్లులు పాస్‌ కాక(Bills not Passed to Contractors).. పనులు చేయట్లేదని ఫరాజ్‌ఖాన్‌.. మేయర్‌ దృష్టికి తెచ్చారు. ఈ క్రమంలో ఓ వైసీపీ కార్పొరేటర్‌.. తమ వార్డులో వంద శాతం పనులు జరుగుతున్నాయని చెప్పగా.. ఎక్కడ జరుగుతున్నాయని మిగిలిన వారు నిలదీశారు.

No Development in Kurnool: వైసీపీ కార్పొరేటర్లకు తెలుగుదేశం కార్పొరేటర్లు సైతం మద్దతు తెలిపారు. వార్డుల్లో కనీస పనులు కూడా కావట్లేదని.. మేయర్‌కు వివరించారు. కార్పొరేటర్ల విమర్శలను తోసిపుచ్చిన మేయర్‌ రామయ్య.. నగరంలో 7వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. అయితే వాగ్వాదం జరుగుతున్న సమయంలో.. అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు, కమిషనర్‌ సైలెంట్‌గా ఉండిపోయారు.

No Development in Works Gudivada: మరోవైపు కృష్ణా జిల్లాలో కూడా అభివృద్ధి జాడ కన్పించట్లేదు. రాష్ట్రంలో ఎంతో ప్రత్యేక గుర్తింపు ఉన్న గుడివాడలో.. దశాబ్దాలుగా సమస్యలుగా పరిష్కారం కావడం లేదు. నియోజకవర్గ ప్రధాన కేంద్రం కావడంతో పాటు 90 సంవత్సరాల పైబడిన మున్సిపాలిటీగా గుడివాడకు పేరుంది. నాలుగు సార్లు ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొడాలి నాని గెలిచినా.. అభివృద్ధి మాత్రం కనిపించడం లేదు. దీంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

No Development Works: పన్నులపై ఉన్న శ్రద్ధ.. పనులపై ఉండదా! గుత్తేదారులు బెదిరిపోవడానికి ఎవరు కారణం?

ABOUT THE AUTHOR

...view details