ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

JUDGEMENT: వ్యక్తి హత్య కేసు.. ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష - crime news in kurnool district

వ్యక్తి హత్య కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
వ్యక్తి హత్య కేసులో ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష

By

Published : Oct 18, 2021, 3:43 PM IST

Updated : Oct 18, 2021, 9:03 PM IST

15:40 October 18

ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన ఆళ్లగడ్డ కోర్టు

 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని జిల్లా అదనపు న్యాయస్థానం(allagadda court)... ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష(life time prison punishment) విధించింది. 2013 మే 10న కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామం వద్ద నర్సింహారెడ్డి అనే వ్యక్తిని.. అదే గ్రామానికి చెందిన హరికట్ల చిన్నసుంకిరెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాయుడులు కత్తులతో నరికి దారుణంగా హత్య(murder) చేశారు. ఈ ఘటనపై విచారించిన అదనపు జిల్లా న్యాయమూర్తి డి. అమ్మన్న రాజా ఈ మేరకు తీర్పు వెలువరించారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల జరిమానా(thousand rupees fine) విధించారు.  

 గ్రామ ఆధిపత్యం కోసం 2000 సంవత్సరంలో నరసింహారెడ్డి అరికట్ల బాల సుంకిరెడ్డిని హత్య చేశాడు. ఈ కేసులో నరసింహా రెడ్డిపై నేరారోపణ నిరూపితం కావడంతో నరసింహారెడ్డి ఏడు సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. శిక్ష పూర్తి చేసుకుని భీమునిపాడు వచ్చిన నరసింహారెడ్డిని.. ఎలాగైనా హత్య చేయాలన్న ఉద్దేశంతో చిన్న సుంకిరెడ్డి.. మరో నలుగురితో కలిసి దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య నిరూపితం కావడంతో నిందితులందరికీ జైలు శిక్ష పడింది.

ఇదీచదవండి.

Badwel Bypoll: 30న బద్వేలు ఉపఎన్నిక.. నియోజకవర్గ పరిధిలో సెలవు

Last Updated : Oct 18, 2021, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details