కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కోలుకుంటున్నవారి సంఖ్య సైతం పెరగటం కొంత ఆనందించాల్సిన విషయమని అధికారులు అభిప్రాయ పడుతున్నారు. మంగళవారం కొత్తగా నమోదైన 830 కేసులతో.. ఇప్పటి వరకు 34,782 మంది కరోనా బారిన పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 27,604 మంది డిశ్చార్జ్ అయ్యారనీ.. 6,872 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం శాంతిరాం కొవిడ్ ఆసుపత్రి నుంచి 31 మంది కరోనా నుంచి కోలుకొని.. డిశ్చార్జి అయినట్లు తెలిపారు.
కర్నూలులో పెరుగుతున్న రికవరీ రేటు - కర్నూలు కొవిడ్ వార్తలు
కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 830 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నా.. రికవరీ రేటు సైతం అధికంగా ఉందని అధికారులు వివరించారు.

కర్నూలులో పెరుగుతున్న రికవరీ రేటు