ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నందికొట్కూరు వరద ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన - నందికొట్కూరు వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన

కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ నందికొట్కూరులోని వరద ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ముంపునకు గురైన కాలనీ వాసులు, రైతులతో మాట్లాడి ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

నందికొట్కూరు వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన
నందికొట్కూరు వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పర్యటన

By

Published : Sep 15, 2020, 7:57 PM IST

కర్నూలు జిల్లా నందికొట్కూరులోని వరద ముంపు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ వీరపాండియన్.. స్థానిక ఎమ్మెల్యే ఆర్థర్​, జిల్లా ఎస్పీ ఫకీరప్పతో కలిసి పర్యటించారు. నియోజకవర్గంలోని కొత్తపల్లి, పాములపాడు మండలాల్లో నీటమునిగిన పొలాలను, లోతట్టు కాలనీలు, గువ్వలకుంట్ల బైరప్ప చెరువుకు పడిన గండిని పరిశీలించారు. ఎస్సీ కాలనీలోని వరద బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. వరద ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన రైతులను, లోతట్టు కాలనీలలోని ప్రజలను ఆదుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details