ప్రధానమంత్రి అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్సీ-2020 అవార్డు ఎంపికకుగాను ఇన్నోవేటివ్ (సృజనాత్మకత) కింద 9 అంశాలను ప్రస్తావిస్తూ కలెక్టర్ జి.వీరపాండియన్ పీఎం అవార్డులకు ప్రతిపాదనలు పంపారు. అందులో తడకనపల్లెలోని పశువుల వసతిగృహం అనే అంశం ఎంపికైంది. ఈమేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పాలనా సంస్కరణల శాఖ డైరెక్టర్ సతీష్ కె.జాదవ్ రాసిన లేఖను ఈ.మెయిల్ ద్వారా శుక్రవారం కలెక్టర్ అందుకున్నారు. పీఎం అవార్డుల ప్రజెంటేషన్‌కు రాష్ట్రంలో కర్నూలు కలెక్టర్ ఒక్కరే ఎంపిక కావడం విశేషం. దేశవ్యాప్తంగా 12 మంది కలెక్టర్లు ఎంపికవగా ఏపీ నుంచి కర్నూలు కలెక్టర్ ఒక్కరే ఎంపికయ్యారు. ఎంపిక జాబితాలో వీరపాండియన్ పేరు ప్రథమ స్థానంలో ఉంది. పీఎం అవార్డుల ఎంపికకు కేంద్ర కేబినెట్ కార్యదర్శి బృందం ప్రాథమిక కమిటీ ఈనెల 9వ తేదీన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనుంది. జిల్లా కేంద్రం నుంచి 9వ తేదీ ఉదయం 10 గంటలకు వీడియో, వెబ్ కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్ జీవనోపాదుల కార్యక్రమం కింద కల్లూరు మండలం తడకనపల్లె గ్రామంలో పొదుపు మహిళలు నిర్వహిస్తున్న పశువుల వసతిగృహంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇందులో ఎంపికైతే ఆయనకు పీఎం అవార్డు దక్కనుంది. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాకు డీఆర్‌డీఏ, మార్కెటింగ్, భూగర్భ జల వనరుల శాఖకు మూడు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డులు వచ్చాయి. కలెక్టర్‌కు పీఎం అవార్డుల్లో మొదటి స్థానం రావాలని ఎస్పీ డా.ఫక్కీరప్ప, జేసీలు రవి పట్టన్‌శెట్టి, రాంసుందర్ రెడ్డి, ఖాజా మొహిద్దీన్, జిల్లా అధికారుల సంఘం, పలు శాఖల అధికారులు ఆకాంక్షించారు. 2019లో ప్రధాని మాతృ వందన పథకంపై కేంద్ర మంత్రి చేతుల మీదుగా పీఎం అవార్డు అందుకున్నారు.
జిల్లా పౌరసరఫరాల అధికారిగా సయ్యద్ యాసిన్