'మీలాంటి వారిని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంచకూడదు' - government officers
ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నచిన్న సమస్యలు కూడా పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని చురకలంటించారు.
ప్రజల చిన్నచిన్న సమస్యలను పట్టించుకోపోతే ఎలా అని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ అధికారులను నిలదీశారు. కలెక్టర్ సమావేశ మందిరంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ముఖ్యంగా ఆసుపత్రులు, పాఠశాలల్లో మంచి వసతులు కల్పించాలన్నారు. ఆసుపత్రుల్లో ఏవైన పరికరాలు పని చెయ్యకుంటే వాటి వివరాలు ఇవ్వాలన్నారు. మందుల కొరత ఎందుకు ఉందని వైద్యాధికారిని ప్రశ్నించారు. ఆసుపత్రుల్లో వద్ద డ్రైనేజీ సమస్యలు ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ఇంజనీర్లను నిలదీశారు. మీలాంటి వారిని అసలు ఉద్యోగాల్లో ఉంచకూడదు అని చురకలంటించారు. నిర్లక్ష్యం వీడకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.