కర్నూలులోని బెంగళూరు - హైదరాబాద్ జాతీయ రహదారి మీద నిర్మిస్తున్న పై వంతెన పనులు... మూడేళ్లు గడిచినా పూర్తికావటం లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. రహదారులు అధ్వాన్నంగా మారాయంటూ.. ఆ సంఘం సభ్యులు రోడ్డుపై నిరసనకు దిగారు.
దుమ్ము, ధూళి వల్ల స్థానిక ప్రజలు, చిరు వ్యాపారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పౌర సంక్షేమ సంఘం నేతలు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వంతెన పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.