పట్టణ పేదలకు మంజూరు చేసిన గృహాలపై ప్రభుత్వం చేస్తున్న సమీక్షతో లబ్ధిదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 25 శాతం కంటే తక్కువ నిర్మాణాలు పూర్తైన వాటిని ఆపేయడంపై అసంతృప్తితో ఉన్నారు. తాము చెల్లించిన సొమ్మైనా వెనక్కి ఇవ్వాలని వేడుకుంటున్నారు. లేదా గృహ నిర్మాణాలైనా పూర్తి చేయాలని అభ్యర్థిస్తున్నారు.
టిడ్కో పేరిట డీడీలు
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పట్టణ పేదల కోసం 2,482 గృహాలను గత ప్రభుత్వం మంజూరు చేసింది. జీప్లస్ త్రీ విధానంలో అపార్ట్మెంట్ రూపంలో నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది. ఆళ్లగడ్డలో 26 ఎకరాలు సేకరించి నిర్మాణాలు సైతం ప్రారంభించింది. పనుల వేగం చూసి దాదాపు 1482 మంది గృహాల కోసం టిడ్కో సంస్థ పేరిట కొందరు డీడీలు చెల్లించారు. మార్చి నెలలో ఎన్నికలు నోటిఫికేషన్ రాకతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది.