కర్నూలు అసెంబ్లీ సీటుపై నేతల మాటల పోరు
కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ తనదే అన్న ఎస్వీ మెహన్ రెడ్డి వ్యాఖ్యలపై ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందించారు. నియోజకవర్గం ఎవరి సొమ్ము కాదని.. ప్రజాభిదరణ ఉన్న నేతకే అధిష్ఠానం టిక్కెట్ ఇస్తుందన్నారు
ఎస్వీ వర్సెస్ టీజీ
లోకేశ్ ఎమ్మెల్యేగా కర్నూలు నుంచి పోటీ చేయాలని ఎస్వీ మెహన్ రెడ్డి ఆహ్వానించారు. దాదాపు తనకు ఖరారైన సీటును లోకేశ్ కావాలంటే త్యాగం చేస్తానన్నారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యమని వెల్లడించారు. ఈ విషయంపై ఎంపీ టీజీ వెంకటేశ్ స్పందిస్తూ... నియోజకవర్గం ఎవరి సొత్తు కాదన్నారు. ప్రజాదరణ ఉన్న నేతకే అధిష్ఠానం అవకాశం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.