ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ విమానాశ్రయం మరింత ఆలస్యం! - kurnool latest news

కర్నూలు విమానాశ్రయం పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పాత గుత్తేదారులు తప్పుకోవటం పనుల జాప్యానికి కారణమైంది. ఏప్రిల్‌ నుంచి సర్వీసులు ప్రారంభిస్తామని అప్పట్లో ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు.

విమానాశ్రయం

By

Published : Oct 21, 2019, 8:51 PM IST

కర్నూలు విమానాశ్రయం... మరింత ఆలస్యం

కర్నూలు జిల్లావాసుల దశాబ్దాల కల ఇప్పుడే నెరవేరేలా కనిపించటం లేదు. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న కర్నూలు విమానాశ్రయం పనులు నత్త నత్తనడకన సాగుతున్నాయి. పాత గుత్తేదారు పనుల నుంచి తప్పుకున్నందున కొత్త టెండర్ పిలువనున్నారు. గతేడాది డిసెంబర్ నెలలో ట్రయిల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది జనవరి నెలలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేశారు. ఏప్రిల్ నుంచి సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్(ఏటీసీ), అడ్మినిస్ట్రేషన్ భవనం, ఎలక్ట్రిసిటీ బిల్డింగ్, వాటర్ ట్యాంక్ పనులు పూర్తి కాలేదు. పనుల పూర్తికి మరో 3 నెలల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. కనీసం కొత్త ఏడాదిలోనైనా విమానాశ్రయం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details