కర్నూలు జిల్లా డోన్‌లోని ఎస్కేపీ ఉన్నత పాఠశాలలో 1988-89 సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వేడుకగా జరిగింది. తమకు చదువు చెప్పిన గురువులను రథంలో కూర్చోబెట్టి ఊరేగించారు. ముక్తేశ్వర ఆలయం నుండి పాత బస్టాండ్ మీదుగా మధు ఫంక్షన్ హాల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టి, వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. మధు ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థులంతా సమావేశమవగా.. గురువులకు సన్మానం చేసి ఘనంగా సత్కరించారు. పూర్వ విద్యార్థులలో మృతి చెందిన కొందరు విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం... ఉపాధ్యాయులకు 'రథ' సత్కారం - kurnool tenth calss students get together
గురువులపై ప్రేమ, వాత్సల్యాలు మరువలేనివి. తల్లిదండ్రుల తరువాత ఉత్తమమైన స్థానం వారిదే. ఆచార్య దేవోభవ అంటూ దైవంతో పోల్చుకుంటాం. అందుకేనేమో 30 సంవత్సరాలైనా జ్ఞానాన్ని ఇచ్చిన ఆ గురువులను పూర్వ విద్యార్థులు మరువలేదు. వారిని రథంలో ఉరేగించి ఘనంగా సత్కరించారు.

కర్నూలులో 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
కర్నూలులో 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
TAGGED:
get together in kurnool