కర్నూలు జిల్లా ఆదోని బైపాస్ దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. కర్ణాటక నుంచి అక్రమంగా ఆటోలో మద్యం తరలిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 576 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రెండు లక్షలు ఉంటుందని, అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. కొత్త చట్టం ప్రకారం 8 ఏళ్ల శిక్ష ఉందని యువకులు డబ్బుకు ఆశపడి జీవితం నాశనం చేసుకోవద్దని సూచించారు.
ఆదోనిలో కర్ణాటక మద్యం పట్టివేత..ఇద్దరు అరెస్ట్ - adoni taja news about liquor
అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని సరకు సీజ్ చేశారు. వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
kurnol dst adoni police seized karnatka liquor
TAGGED:
adoni taja news about liquor