కుందూ నదికి వరదలు వచ్చినప్పుడు పరివాహక ప్రాంతాల్లో జరిగే నష్టాన్ని అరికట్టేందుకు రూ.340 కోట్లతో కరకట్ట నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల, బనగానపల్లి, ఆళ్లగడ్డ నియోజకవర్గాల గుండా ప్రవహించే కుందు నదికి వరద వస్తే పరివాహక ప్రాంతాల ప్రజలు నష్టపోతారు. పంట పొలాలు నీట మునుగుతున్నాయి.
ఈ సమస్య పరిష్కారానికి రూ.340 కోట్లతో కరకట్టను నిర్మించేందుకు గురువారం దొర్నిపాడులో శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. కరకట్ట నిర్మాణం పూర్తయితే వరద నష్టం తగ్గుతుందన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.