ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

KRMB TEAM: రాయలసీమలో కేఆర్ఎంబీ బృందం పర్యటన..16న నివేదిక సమర్పణ - KRMB team to visit Rayalaseema Upliftment Project

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఈనెల 16న జాతీయ హరిత ట్రైబ్యునల్​కు నివేదిక ఇస్తామని కేఆర్ఎంబీ బృందం స్పష్టం చేసింది. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు పనులు జరుగుతున్న ప్రాంతంలో.. పర్యటించిన బృందం క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించింది. కేఆర్ఎంబీ బృందం ఇచ్చే నివేదికపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శించనున్న కేఆర్ఎంబీ బృందం
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శించనున్న కేఆర్ఎంబీ బృందం

By

Published : Aug 11, 2021, 5:39 PM IST

Updated : Aug 11, 2021, 8:51 PM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన కేఆర్ఎంబీ బృందం

రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించింది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించి ఆగస్టు 16నాటికి నివేదిక ఇవ్వాలన్న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలకు అనుగుణంగా కృష్ణా బోర్డు కన్వీనర్ డీఎం. రాయపురే, సభ్యులు ఎల్​బీ మౌంతంగ్, దర్పన్ తల్వార్..ప్రాజెక్టు ప్రాంతంలో పరిశీలన చేశారు. హైదరాబాద్‌ నుంచి కర్నూలు వచ్చిన బృందం అక్కడ నుంచి నేరుగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్దకు వెళ్లారు. అక్కడే నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి కేఆర్ఎంబీ బృందానికి ప్రాజెక్టు వివరాలను అందించారు.

ముచ్చుమర్రిని ఎందుకు నిర్మించారో వివరాలు తెలుసుకున్న కేఆర్ఎంబీ సభ్యులు..తర్వాత మల్యాల, హంద్రినీవా పథకాల వివరాలు సేకరించారు. ఆ తర్వాత కేఆర్ఎంబీ బృందం రాయలసీమ ఎత్తిపోతల నిర్మిస్తున్న ప్రాంతానికి వెళ్లింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు సేకరించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈనెల 16న జాతీయ హరిత ట్రైబ్యునల్​కు నివేదిక ఇస్తామని కేఆర్ఎంబీ బృందం స్పష్టం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు నిలిపివేసినట్టు ఏపీ ప్రభుత్వం చెబుతున్నందున క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కేఆర్ఎంబీ బృందం నివేదికపై ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చదవండి:
CM Review : వ్యాక్సినేషన్‌లో ఉద్యోగులు, సిబ్బందికి ప్రాధాన్యం

Last Updated : Aug 11, 2021, 8:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details