కర్నూలులో వాన బీభత్సం.. విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు - knl_rain_powersupply stops
ఎండకు అల్లాడుతున్న కర్నూలు జిల్లా ప్రజలను వరుణుడు కరుణించాడు. గాలి వానతో వాతావరణాన్ని చల్లబరిచాడు

కర్నూలులో వాన బీభత్సం
కర్నూలులో వాన బీభత్సం
కర్నూలు జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. గాలికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కర్నూలు సమీపంలోని నూతనపల్లె, సుదిరెడ్డిపల్లె, పసుపుల, నందన పల్లె, భూపాల్ నగర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు విరిగి ఇళ్లు, పశువుల పాకలపై పడ్డాయి. నూతనపల్లెలో ఓ ఇంటి పైకప్పు దెబ్బతిని ఫ్యాన్ కింద పడిపోయింది. కొన్నిచోట్ల పశువుల పాకలు భారీగా గాలికి ఎగిరిపోయాయి. ధాన్యం తడిసిపోయాయని రైతులు బోరుమంటున్నారు.
TAGGED:
knl_rain_powersupply stops