కర్నూలు జిల్లా డోన్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో ఆదివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి రూ.65.60 లక్షల నగదు దోచుకెళ్లారు. రాత్రి 3 గంటల సమయంలో ఏటీఎంలో చొరబడ్డ దుండగులు.. ముందుగా సీసీ కెమెరాలను ధ్వంసం చేసి అలారం వైరును కట్ చేశారు. అనంతరం గ్యాస్‌కట్టర్లుతో ఏటీఎం యంత్రాలు ధ్వంసం చేసి రూ.65.60 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. చోరీకి గురైనట్లు గుర్తించిన బ్యాంకు సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ATM ROBBERY: ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ... రూ.65.60 లక్షలు స్వాహా - latest news in kurnool district
ఏటీఎంలో చోరీ
12:39 August 30
డోన్‌లోని ఎస్‌బీఐ ఏటీఎంలో చోరీ..
అదే అదునుగా..
వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో.. ఎస్‌బీఐ అధికారులు శుక్రవారం రెండు ఏటీఎంలలో రూ. 85 లక్షల నగదు పెట్టారు. ఏటీఎం వద్ద నాలుగేళ్లుగా సెక్యూరిటీ లేదు. ఇదే అదునుగా భావించిన దొంగలు.. సులువుగా చోరీకి పాల్పడ్డారు.
ఇదీ చదవండీ..విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిధిలో పీవీ సింధు సందడి
Last Updated : Aug 30, 2021, 7:05 PM IST